మనికకు అర్జున దక్కనుందా?

మనికకు అర్జున దక్కనుందా?

ఢిల్లీ , 23 ఏప్రిల్:

కామన్వెల్త్ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్ జాబితా తీస్తే ముందు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బత్రా పేరే ఉంటుంది. గోల్డ్ కోస్ట్‌లో ఒకటి కాదు.., రెండు కాదు.. ఏకంగా నాలుగు పతకాలు గెలిచింది ఈ ఢిల్లీ అమ్మాయి. అందులో రెండు స్వర్ణాలు కూడా ఉన్నాయి.

మేటి క్రీడాకారిణుల్ని ఓడించి సింగిల్స్ స్వర్ణం సాధించింది. టీం ఈవెంట్లో భారత్‌కు స్వర్ణం దక్కడానికి కూడా మనికనే కారణం. ఆమె సాధించిన కీలక విజయమే భారత్‌కు పతకం అందించింది.

ప్రపంచ నాలుగో నంబర్ క్రీడాకారిణి ఫెంగ్ (సింగపూర్)ను మనిక ఒకటికి రెండు సార్లు ఓడించడం విశేషం. 22 ఏళ్లకే ప్రపంచ మేటి క్రీడాకారిణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మనికను ఈ ఏడాది అర్జున అవార్డు వరించే

అవకాశాలున్నాయి. ఆమె పేరును జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ కేంద్ర ప్రభుత్వానికి అర్జున అవార్డు కోసం ప్రతిపాదించింది. మనిక చేసిన ప్రదర్శన ప్రకారం చూస్తే ఆమెకు అర్జున దక్కడం లాంఛనమే అనుకోవాలి.

నిజానికి ఆమెకు రాజీవ్ ఖేల్ రత్న కూడా ఇవ్వొచ్చు కానీ.. ఈసారి పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి కేంద్రం ఆమెకు అర్జునతో సరిపెట్టవచ్చు.

మామాట: ప్రతిభకి గౌరవం దక్కడంమే నిజమైన గుర్తింపు కదా…

English summary:

National Table Tennis federation recommended table tennis athlete Manika batra name for Arjuna award. As she was played very well in common wealth games NTTF recommended her name.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *